మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కెన్-బెట్వా ప్రాజెక్టులో భాగంగా మజగవా-రూంజ్ నదుల మధ్య అనుసంధానం జరుగుతోంది. పలు గ్రామాలకు చెందిన రైతులు భూములు కోల్పోవడంతో నిర్వాసితులవుతున్నారు. తమకు తగిన నష్ట పరిహారం చెల్లించడంతో పునరావాసం కల్పించాలని రైతులు ఆందోళనకు దిగారు. పలువురు రైతులు నీటి మడుగులో చితులు పేర్చుకోవడంతో పాటు మృతదేహంలా పడుకున్నారు. మరికొందరు ఉరేసుకొని తమ బాధలను వ్యక్తం చేశారు.