కాకినాడ జిల్లాలోని సొంత నియోజకవర్గం పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఎఫ్.కె.పాలెంలో మైసమ్మ చెరువును ఆయన పరిశీలించారు.అక్కడ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలో నగరవనాన్ని ప్రారంభించి స్థానికులతో మాట్లాడారు. మైసమ్మ చెరువు నుంచి ఎఫ్. కె.పాలెం ప్రధాన కూడలి వరకు నడిచి వెళ్లారు. మార్గంమధ్యలో ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులతో ఫొటోలు దిగారు.