అంతరిక్ష రంగంలో వేగంగా విస్తరిస్తోన్న చైనా.. తన ప్రయోగ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఇటీవల కేవలం 45 గంటల వ్యవధిలో నాలుగు రాకెట్లను విజయవంతంగా ప్రయోగించి సరికొత్త చరిత్ర సృష్టించింది. సెప్టెంబరు 15-16 మధ్య మూడు లాంచింగ్ కేంద్రాల నుంచి ఈ ప్రయోగాలు జరిగినట్లు చైనా మీడియా వెల్లడించింది. ఇందులో ప్రైవేటు సంస్థలు అభివృద్ధి చేసిన రాకెట్లూ ఉన్నాయని పేర్కొంది. ఈ నాలుగు వ్యోమనౌకలు.. తాము మోసుకెళ్లిన ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో చేర్చినట్లు తెలిపింది.