దిగ్గజ టెక్ కంపెనీలు ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ, స్పేస్ ఎక్స్, గూగుల్ ఏఐ అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా నెమ్మది చేసేందుకు అక్రమంగా ఒప్పందం కుదుర్చుకున్నాయని అమెరికాలోని కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ జిల్లా ఫెడరల్ కోర్టులో శుక్రవారం కేసు దాఖలైంది. ఆ సంస్థలు కలిసి ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం అమెరికా యాంటీట్రస్ట్ చట్టాలకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. చాట్ జీపీటీ, క్లౌడ్, గ్రోక్, జెమిని వంటి ఏఐ సేవలకు డబ్బులు చెల్లిస్తున్న నలుగురు వినియోగదారులు ఈ కేసు వేశారు