సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి వద్ద HYD – ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం వైపు వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే కారు మొత్తం మంటలు వ్యాపించాయి. కారులో ఉన్న వ్యక్తి బయటకు రాలేక, లోపలే చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. మృతుడిని డాక్టర్ కాసకుర్తి జగదీశ్, ఖమ్మం మమత ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా గుర్తించారు.