జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో ఆతిథ్య దేశానికి అద్భుతమైన ఆరంభం లభించింది. పురుషుల వ్యక్తిగత ట్రైథ్లాన్ పోటీలో జపాన్ అథ్లెట్ తకుమి హోజో అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఈ టోర్నమెంట్‌లో తొలి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు.కఠినమైన ట్రైథ్లాన్ ఈవెంట్‌లో 750 మీటర్ల దూరం ఈత కొట్టడం, 20 కిలోమీటర్ల సైక్లింగ్ అలాగే 5000ల మీటర్ల పరుగు అన్ని విభాగాలను అత్యంత వేగంగా పూర్తి చేసిన హోజో 52 నిమిషాల 56 సెకన్ల వ్యవధిలో గమ్యస్థానాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు.