రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం 28 జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల ఖరారు పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 15, 16 తేదీల్లో రాజకీయపక్షాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించినట్టు ఈసీ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలు, 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. పదవీ కాలం వచ్చే వారంలో ముగియనుండటంతో EC ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ముందుగా పోలింగ్ స్టేషన్ల సంఖ్యను ఖరారు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.