ఆర్కే బీచ్‌లో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కార్మికులతో కలిసి ప్లాస్టిక్, చెత్త, వ్యర్థాలను తొలగించారు. గణపతి నవరాత్రుల నేపథ్యంలో నిమజ్జనాల కోసం ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న చిరు వ్యాపారులతో మాట్లాడిన సీఎం.. ఈ సందర్భంగా మూరీ మిక్చర్, పల్లీ మసాల తయారు చేసి విక్రయిస్తున్న అట్టాడ నాగమణి అనే మహిళతో ఆయన మాట్లాడారు. ఆమె స్వయంగా తయారు చేసిన మూరీ మిక్చర్‌ను రుచి చూసి.. చాలా బాగుందని ప్రశంసించారు.