మధ్యప్రదేశ్‌లోని పెట్రోల్ బంకుల్లో రూ.2,000 కంటే ఎక్కువ మొత్తానికి UPI చెల్లింపులు స్వీకరించరని, మర్చంట్ ఫీజులకు నిరసనగా పెట్రోల్ పంపు యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పెట్రోల్ బంకుల్లో రూ.2,000 దాటిన UPI చెల్లింపులను స్వీకరించకూడదనే నిర్ణయం ఏదీ తీసుకోలేదని ఇండియన్ ఆయిల్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ నకిలీ, తప్పుదోవ పట్టించేదిగా పేర్కొంది. సెప్టెంబర్ 23, 2026న ఇండోర్‌లో “No-UPI Day” కార్యక్రమాన్ని ప్రకటించలేదని స్పష్టం చేశారు.