<span;>మిడిల్ ఈస్ట్ మరోసారి అగ్నిగుండంగా మారింది. ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో అమెరికా, తమ పౌరులకు తీవ్రస్థాయి భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప మిడిల్ ఈస్ట్ వైపు ప్రయాణాలు చేయవద్దని, అక్కడ ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని తేల్చిచెప్పింది. ఏ క్షణంలోనైనా విమాన రాకపోకలు స్తంభించిపోవచ్చని, గగనతలాలు మూతపడే ప్రమాదం ఉందంటూ వాషింగ్టన్ విడుదల చేసిన ‘వరల్డ్ వైడ్ కాషన్’ నోట్ ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.