ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ శివారు భూముల్లో సర్వే కొనసాగుతోంది. సర్వే నెంబరు 325లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు అధికారులు నోటీసులు ఇస్తున్నారు. విడతల వారీగా నోటీసుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 215 మందికి నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ 50 మంది రైతులకు నోటీసులు జారీ చేశారు. సర్వే నెంబరు 325లో ఈ నెల 21 నుంచి నాలుగు విడతల్లో సర్వే కొనసాగనుంది. 21వ తేదీన రైతులు భూమి వద్దకు వచ్చి వివరాలు తెలియజేయాలని నోటీసులో వెల్లడించారు.