నేటి ఆధునిక వాతావరణ సవాళ్లకు శాశ్వత పరిష్కారాలు అందించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను అనవసరంగా నిందిస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారతదేశంలో తలసరి కర్బన ఉద్గారాల వాటా సగం కంటే తక్కువగా ఉంది.అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి కర్బన ఉద్గారాలు భారత్ కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని దిల్లీలో జరిగిన ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.