గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా డిజె శబ్ధాలకు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. డిజె శబ్ధానికి గుండెలు ఆగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఇ తాండ్రపాడు గ్రామంలో శివమ్మ(36) డిజె శబ్ధానికి గుండె ఆగి చనిపోయింది. డోన్‌లో కూడా వినాయక నిమజ్జనంలో పాల్గొన్న యువకుడు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. వినాయక నిమజ్జనం సందర్భంగా కొందరు డ్యాన్స్ చేయడంతో అలసిపోవడంతో పాటు శబ్ధానికి గుండె ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు