ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారత పతాకధారిగా స్టార్ షూటర్ మనూ బాకర్‌తో పాటు ఎంపికైన షాట్‌పుట్ ఆటగాడు తజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో కబడ్డీ ప్లేయర్ పవన్ షెరావత్ వచ్చాడు. తూర్ అఫీషియల్ కిట్ ఇంకా అతడికి చేరలేదు. దీంతో భారత పతాకధారిగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని అతడు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో భారత పతాకధారులుగా మనూతో కలిసి పవన్ పాల్గొననున్నాడని చీఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్ మీడియాకు వెల్లడించారు.