10 లక్షల సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ఓ ‘బేబీ ప్లానెట్’ను గుర్తించారు నాసా పరిశోధకులు . ఇప్పటివరకు శాస్త్రవేత్తలు గుర్తించిన గ్రహాల్లో ఇదే అత్యంత పిన్న వయసున్నదిగా రికార్డు సృష్టించింది. ఈ కొత్త గ్రహానికి ఎలియాస్ 2-24 బి అని పేరు పెట్టారు.దీని పరిమాణం మన సౌర కుటుంబంలోని బృహస్పతి గ్రహానికి దాదాపు సమానం. ఇంకా పూర్తిగా ఏర్పడని ఈ గ్రహం.. తన చుట్టూ ఉన్న వాయువు, ధూళి, మంచు, రాతి పదార్థాలను ఆకర్షించుకుంటూ పెరుగుతున్నట్లు ఆధారాలు లభించాయి.