ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బంది, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో జరిగిన 78వ పాలకవర్గ సమావేశంలో ఇంటర్ బోర్డులో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆమోదం తెలిపింది. పబ్లిక్ పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనంలో పారితోషికాన్ని 25 శాతం పెంచాలని బోర్డు నిర్ణయించింది. 1978 నుంచి ఇప్పటివరకు బోర్డు జారీ చేసిన అన్ని ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లను డిజిటలైజ్ చేసి, వాటి భద్రత కోసం బ్లాక్‌చైన్ టెక్నాలజీతో అనుసంధానించాలని తీర్మానించారు.