సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సాయికృష్ణను కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే అతడు మృతి చెందినట్లు సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో పేర్కొంది. ఈ కేసులో సీఐ నాగరాజుతో పాటు పలువురు పోలీసు సిబ్బందిపై ఆరోపణలు నమోదయ్యాయి. సిట్ నివేదిక ప్రకారం.. పోలీసుల దాడుల అనంతరం సాయికృష్ణ లాకప్‌లోనే మృతి చెందినట్లు దర్యాప్తులో తేలినట్లు పేర్కొంది. అనంతరం మృతదేహాన్ని తరలించి దహనం చేయడం ద్వారా ఆధారాలను మాయం చేసినట్లు సిట్ నివేదికలో పేర్కొంది.