పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ ఎదురైంది. ఆమె నేతృత్వంలోని టీఎంసీ వర్గం అభ్యర్థిని సంచితా ప్రధాన్ డే, కీలక నందిగ్రామ్ ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయారు. రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచిన సీఎం సువేందు అధికారి, నందిగ్రామ్ స్థానాన్ని వదులుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.