ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపు అంశంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిస్తూ ఆయనపై అనర్హత వేటు వేసింది. దానం నాగేందర్ విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అనర్హత పిటిషన్లు కొట్టివేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్, ఈసీకి హైకోర్టు తెలిపింది.