దేశవ్యాప్తంగా గంటల తరబడి పవర్ కట్‌లతో బంగ్లాదేశ్ అంధకారంలో కూరుకుపోయింది. తమ విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు 44 శాతానికి పైగా కేవలం సహజ వాయువు పైనే ఆధారపడటం ఈ పరిస్థితికి ప్రధాన కారణమైంది. తగినంత విదేశీ మారక నిల్వలు లేకపోవడంతో సరుకు కొనుగోలు చేయలేక, స్థానిక ఉత్పత్తి పడిపోయి విద్యుత్ ప్లాంట్లు మూతపడే స్థాయికి చేరుకున్నాయి. ప్రధాన ఆసుపత్రులలో అత్యవసర వైద్య సేవలు, ఐసియులు, శస్త్రచికిత్సలకు విద్యుత్ లేక రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి.