యాపిల్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ అధికారిక విక్రయాలు ఈరోజు ప్రారంభమయ్యాయి.
దీంతో బెంగళూరులోని మాల్ ఆఫ్ ఆసియాలో ఉన్న ‘ఇమాజిన్’ యాపిల్ ప్రీమియం రీసెలర్ స్టోర్ కొనుగోలుదారులు భారీగా తరలివచ్చారు. సరికొత్త ఐఫోన్ వర్షన్లను అందరికంటే ముందే చేజిక్కించుకోవాలనే ఉత్సాహంతో యాపిల్ ప్రేమికులు తెల్లవారుజాము నుంచే పొడవైన క్యూ లైన్లలో వేచి ఉన్నారు.