టీ20 పవర్ ప్లేలో అత్యధిక పరుగుల రికార్డును అభిషేక్ శర్మ – సంజు శాంసన్ ద్వయం బద్దలుకొట్టింది. అఫ్గానిస్థాన్ తో జరుగుతున్న మూడో టీ20లో తొలి ఆరు ఓవర్లలో ఓపెనింగ్ జోడీ 100 పరుగులు చేసింది. భారత టీ20 క్రికెట్లో ఇదే అత్యధికం. ఇప్పటికే 2025లో ఇంగ్లాండ్ పై చేసిన 95/1 మన టాప్ పవర్ ప్లే స్కోర్. ఓవరాల్ గా చూస్తే.. ఈ స్కోరు మూడో అత్యధికం. తొలి రెండు స్థానాల్లో 113/0 (AUSxSCO), 102/0 (SAxWI) ఉన్నాయి.