పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్న అధికారిక కార్యక్రమాలకు సైతం ముస్లిం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని హాజరు కానివ్వకుండా దూరంగా ఉంచుతున్నారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఏయే సీనియర్ అధికారుల్ని దూరంగా ఉంచారో వెల్లడిస్తూ ఓ జాబితా విడుదల చేశారు.అక్కడితో ఆగకుండా ఐక్యరాజ్యసమితిలోని మైనార్టీ సమస్యల ప్రత్యేక ప్రతినిధికి ఆమె ఫిర్యాదు చేశారు. సిలిగురిలో జరిగిన సరిహద్దు భద్రతా సమీక్షలో CP సయ్యద్ వకార్ రజాను వెళ్లిపోవాలని ఆదేశించినట్లు ఆరోపించారు.