సంగారెడ్డి జిల్లా పెద్దలోని గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న కొద్దిసేపటికే సుమారు 15 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, వికారంతో అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య పరిస్థితిని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.