ఏపీ సీఎం చంద్రబాబు వారణాసిలో పర్యటిస్తున్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో పాల్గొనేందుకు సీఎం వచ్చారు. పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు రాజ్నాథ్సంగ్, పంకజ్ చౌదరి, చిరాగ్ పాసవాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులతో కలిసి కాశీ విశ్వనాథుడిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్రమంత్రులతో కలిసి సీఎం ప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.