బ్రిక్స్ సమ్మిట్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆరోగ్యంపై వెలువడిన ఒక వార్త ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయంలో తీవ్ర కలకలం రేపుతోంది. జిన్పింగ్.. సమ్మిట్ మధ్యలోనే స్పృహతప్పి పడిపోయారని, అనంతరం ఆయనకు తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం సంచలనంగా మారింది. ఈ సంచలన వార్తను చైనాలో నిషేధానికి గురైన ‘చైనా డెమోక్రసీ పార్టీ’ అధ్యక్షుడు వాంజున్ క్సీ బయటపెట్టారు. వాంజున్ క్సీకి గతంలోనూ అనేక వివాదాస్పదమైన, కల్పిత కథనాలు ప్రచారంలోకి తెచ్చిన చరిత్ర ఉంది.