ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తహసీల్దారులు నివాస ధ్రువీకరణపత్రాల జారీచేసే అధికారాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై ప్రజలు రెసిడెన్స్ సర్టిపికేట్ తీసుకోవాలంటే తగిన ఆధారాలతో దరఖాస్తుల్ని తహసీల్దారుకు సమర్పించాల్సి ఉంటుంది.. ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకపోతే తహసీల్దారు స్థానికంగా విచారణ జరిపి నివాసాన్ని ధ్రువీకరించి పత్రం జారీచేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2015 జూన్ 20న ఆధార్, రేషన్ కార్డులను నివాస రుజువులుగా ఉపయోగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2015లో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు.