ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయుడు లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన పనిచేసే పాఠశాలలోనే ఓ వ్యక్తి ఆయన్ను తుపాకీతో కాల్చి చంపాడు. నజీబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌపురి గ్రామంలో ఈ ఘటన జరిగింది. హత్య తర్వాత నిందితుడు గౌరవ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 4నెలల క్రితం ఓ యువతి, తాలిబ్ అనే యువకుడు కలవడానికి ఉపాధ్యాయుడు నౌషాద్ సాయం చేసేవారని నౌషాద్ చేసింది లవ్ జిహాద్‌ను ప్రోత్సహించడమేనని అందుకే ఆయన్ను కాల్చిచంపేశానని వివరించాడు.