ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథతో తెరకెక్కనున్న సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమాకు ‘ఎం.ఎస్’ అనే పేరు ఖరారు చేశారు. ‘ఏ లెగసీ ఆన్ స్క్రీన్’ అనేది ఉప శీర్షిక. సుబ్బులక్ష్మి 116వ జయంతిని పురస్కరించుకొని చెన్నై వేదికగా సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు.