సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడినట్లు సమాచారం. గ్రామంలోని వినాయక విగ్రహం నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్లిన వారిలో ఆరుగురు ప్రమాదవశాత్తూ నేరేడు చెరువులో పడి మృతి చెందారు. మృతులను శిరీష ఛారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులుగా గుర్తించినట్టు తెలుస్తోంది.