తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం వరకు కిలో రూ.50గా ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో రూ.70 నుంచి రూ.80 వరకు చేరింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి క్వింటాల్ ధర రూ.5,200 నుంచి రూ.5,500 వరకు పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి మాత్రమే ఉల్లి సరఫరా అవుతోందని, రోజుకు సుమారు 5,200 నుంచి 6,000 క్వింటాళ్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.