మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ అనే భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 1897 నుంచి 1922 మధ్య కాల నేపథ్యంతో తెరకెక్కుతున్న చిత్రం. సీనియర్ నటి రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మంచు మనోజ్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో ఆమె ‘కమల రెడ్డి’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.