సామాజిక మాధ్యమాల్లో బాలలపై లైంగిక వేధింపులకు స్వస్తి పలికేందుకు ప్రముఖ టెక్ సంస్థ ‘మెటా’ చిన్నారులపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు, చట్టవిరుద్ధమైన కంటెంట్‌కు సంబంధించిన కేసుల వివరాలను భారత దర్యాప్తు సంస్థలకు నేరుగా అందించేందుకు అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇకపై పిల్లల భద్రతకు సంబంధించిన ఫిర్యాదులు, ఆధారాలను ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ (I4C) నిర్వహిస్తున్న పోర్టల్‌కు మెటా నేరుగా చేరవేస్తుంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ ప్రకటనల్లో బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన మెటీరియల్స్ ప్రసారమయ్యాయని బీబీసీ కథనం ప్రచురించింది.