తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుంపు దాడులు కేవలం హత్యలతోనే ప్రారంభం కావని, పూర్తి స్థాయిలో పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లోనే యూనిఫాం ధరించిన అధికారుల ముందే పథకం ప్రకారం జరిగే దాడులతో కూడా మొదలవుతాయని ఆయన అన్నారు. తన పీఆర్ మహేష్ మణిక్యాల, పీఏ మహేందర్ రెడ్డిలపై పోలీస్ స్టేషన్ లోపలే దాడి జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రస్తుతం అరాచకత్వ అంచున నిలిచిందని, కాంగ్రెస్ పాలనలోనే ఇది సాధ్యమైందని.. రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ విమర్శించారు.