బ్రిక్స్ కూటమి వేదికగా గ్లోబల్ సౌత్ దేశాల గొంతును బలంగా వినిపిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఆ దేశాల్లో బ్రిక్స్‌పై విశ్వాసం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. భిన్నత్వం, పరస్పర సహకారమే బ్రిక్స్ కూటమికి ప్రధాన బలమని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ దేశాల ఆందోళనలు, అనుభవాలకు బ్రిక్స్‌లో తగిన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.