అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజిల్స్ నగరం తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారింది. నిరసనల సమయంలో అల్లరిమూకలు చెలరేగిపోయాయి. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కు చెందిన వేమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను (Waymo Cars) ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. రోడ్లపై వెళ్తున్న ఈ డ్రైవర్ రెస్ వాహనాల విండ్ స్క్రీన్లను పగలగొట్టి, కార్లపై గ్రాఫిటీ రాసి, నిప్పు పెట్టారు. Waymo Cars విలువ సుమారు 600,000 డాలర్లు ఉంటుంది. భారతీయ కరెన్సీలో ఈ నష్టం రూ.5 కోట్లకు పైగానే ఉంది.