డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేరళలో తన పర్యటనను ముగించారు. తన చికిత్స విజయవంతంగా సాగేందుకు సహకరించిన డాక్టర్ సీతారాం ఆయుర్వేదిక్ రిట్రీట్ వైద్యులు, యాజమాన్యం, సిబ్బందికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స సమయంలో వారికి ఉన్న అంకితభావం, వృత్తి నైపుణ్యం, వ్యక్తిగత శ్రద్ధ తనకు ఎంతో భరోసానిచ్చాయని పేర్కొన్నారు. ప్రగాఢమైన కృతజ్ఞత, గౌరవం, మధుర జ్ఞాపకాలతో కేరళ నుంచి బయలుదేరుతున్నానని చెబుతూ.. “థ్యాంక్యూ కేరళం” అంటూ తన సందేశాన్ని ముగించారు.