న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు వేదికగా పలువురు విదేశీ ప్రతినిధులు ప్రధాని మోదీతో ఫొటో దిగేందుకు ప్రత్యేకంగా ఆసక్తి చూపించారు. “సర్, ప్లీజ్.. మీతో ఒక ఫొటో తీసుకోవచ్చా?” అని విదేశీ డెలిగేట్లు అడగ్గా, ప్రధాని మోదీ ఎంతో సానుకూలంగా స్పందించి, చిరునవ్వుతో వారితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రధాని మోదీ చుట్టూ ప్రతినిధులు చేరడానికి వీలుగా క్లియర్ మార్గాన్ని ఇస్తూ పక్కకు జరిగారు.