నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, శాసనమండలిలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. 22ఎపై చర్చించాలని బిఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు మండలి ఛైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి తిరస్కరించారు. దీంతో వెల్లోకి దూసుకొళ్లిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. ప్లకార్డులతో నిరసనకు దిగారు.పోడియం వద్ద పేపర్లు చించి ఎగరేసారు. ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ప్లకార్డులు తీసేయాలని మార్షల్స్‌కు ఆదేశించారు. ఈ క్రమంలో శాసనమండలి నుంచి బిఆర్ఎస్ సభ్యుల వాకౌట్ చేశారు.