బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో ఎమ్మెల్యేల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ మొదలైంది. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై ఎమ్మెల్యేలతో కేటీఆర్ చర్చిస్తున్నారు. అసెంబ్లీ బయట ఎలాంటి పోరాటాలు చేయాలో దిశానిర్దేశం చేయబోతున్నారు. సభలో లేవనెత్తాలనుకున్న అంశాలను బయట ఉండే ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో.. వ్యూహాలు సిద్ధం చేసుకోబోతున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే కోకాపేటలోని కేటీఆర్ నివాసంలో ఎమ్మెల్యేలతో మీటింగ్ జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.