హైదరాబాద్ నగరంలోని హాస్టళ్ల నిర్వహణ మరియు భద్రతా ప్రమాణాలపై హైడ్రా అత్యంత కఠినమైన నిబంధనలను ప్రకటించింది. సరైన అనుమతులు లేని మరియు సురక్షితం కాని భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లను రాబోయే మూడు నెలల్లోగా పూర్తిగా సురక్షితమైన భవనాలకు మార్చుకోవాలని నిర్వాహకులకు స్పష్టమైన గడువు విధించింది. హాస్టళ్లలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులు మరియు ఉద్యోగుల భద్రతా విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. అగ్నిమాపక భద్రత,ప్రత్యేక నిష్క్రమణ మార్గాలు,పటిష్టమైన నిర్మాణం తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.