అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అప్రజస్వామికంగా సస్పెండ్ చేయడంతో ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమయ్యారు. కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు రంగారెడ్డి జిల్లాలోని కొంగర, ర్యావిరాలకు బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీకి ఫోర్త్ సిటీలో అక్రమంగా కట్టబెట్టిన భూమిని పరిశీలించేందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొండల్ రెడ్డి కంపెనీ టెసెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టింది.