ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కోటి మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఎటువంటి వడ్డీ లేకుండా ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. మొదటి విడతలో రూ. 20,000 అందజేయనున్నారు. ఈ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించిన మహిళా లబ్ధిదారులు రూ.30,000తో కూడిన రెండో విడత రుణానికి అర్హత సాధిస్తారు. ఆ తర్వాత రెండో విడత మొత్తాన్ని తిరిగి చెల్లించిన వారికి రూ. 50,000తో కూడిన మూడో విడత రుణం లభిస్తుంది.