తమ డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలని కోరుతూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా ఒకరోజు ప్రత్యామ్నాయ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో వారానికి 5 రోజుల బ్యాంకింగ్ విధానం, బ్యాంకింగ్ రంగంలో అమలు చేస్తున్న PLI – Performance Linked Incentive విధానాన్ని పూర్తిగా నిలిపివేయాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి