తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ట్రాన్స్జెండర్లకు చోటు కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ సూర్యాపేట జిల్లాకు చెందిన డి.తనుశ్రీ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దరఖాస్తు ఫారాలలో కేవలం స్త్రీ, పురుష లింగాలకే పరిమితమై ‘ఇతరులు’ అనే కాలమ్‌ను ఎందుకు చేర్చలేదని ప్రభుత్వం, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ధర్మాసనం ప్రశ్నించింది. దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 16తో ముగియనుండగా, ఆన్లైన్ పోర్టల్‌లో ఆప్షన్ లేని పక్షంలో
ట్రాన్స్జెండర్ల నుంచి భౌతికంగా దరఖాస్తులను స్వీకరించి రశీదు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది.