ఆకృతి చౌదరిపై జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకోవడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పుపట్టింది.
ఆమెపై నమోదైన కేసును కొట్టివేసింది. బాధితురాలికి అయిదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్నిగౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కలెక్టర్ మేధా రూపం, సంబంధం ఉన్న పోలీస్ అధికారుల జీతాల నుంచి రికవరీ చేయాలని తీర్పు ఇచ్చింది ఢిల్లీ యూనివర్శిటీ లా విద్యార్థిని ఆకృతి చౌదరిని ఈ ఏడాది ఏప్రిల్ లో నొయిడా కార్మికుల నిరసనల నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు.