మంగళవారం శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీల తీరుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ గేట్ల వద్ద మహిళా పోలీసుల సమక్షంలో నిరసనల పేరుతో బట్టలు విప్పుకుని నిరసన తెలపాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ఆమె నిలదీశారు సభాపతి స్థానంలో ఉన్న స్పీకర్ను బీఆర్ఎస్ సభ్యులు దూషించడాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. సభా మర్యాదలను మంటగలిపేలా ప్రవర్తించిన సదరు సభ్యులను కఠినంగా శిక్షించాలని సభలో డిమాండ్ చేశారు.