తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్ట్ చేశారు.తాతా మధును అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. పోలీసుల చర్యను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.