స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అనుచిత వ్యాఖ్యల పట్ల స్పీకర్‌కు మద్దతుగా, ఈ ఘటనను ఖండిస్తూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు సిద్ధిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పిలుపుతో ముందస్తు జాగ్రత్తగా రంగంలోకి దిగిన పోలీసులు, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్‌ను అమలు చేసి, కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ఫామ్‌హౌస్‌కు వెళ్లే ప్రధాన రహదారులన్నింటినీ బారికేడ్లతో మూసివేశారు.