అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నివాసంలో అదుపులోకి తీసుకున్న అనంతరం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో ఆయన పాత్ర, చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.